Kantininda kanneellu unna folk song lyrics in telugu

Kantininda kanneellu unna folk song lyrics in telugu

కంటినిండ కన్నీళ్లున్నా ఆ నటనేందే

నీకా నటనేందే

మనసార విప్పి చెప్పరాదే

గుండెనిండ బాధే ఉన్నా ఆ బాధేందే

నీకా బాధేందే, నేను చూడలేనే

నువ్వు ఎంత దాచినా

కన్నుల్లోనె ఆపినా

కనిపిస్తయె నాకు నీ కన్నీళ్ళే

వేయలేనే అంచనా

ఎంత ప్రేమించినా

నిజమైనది కాదు నీ చిరునవ్వే

నువ్వు నవ్వుతున్న నవ్వులోన కన్నీళ్లున్నయే

కళ్ళార నాకు కనబడుతుందే

నీ మనసులోన నలుగుతున్న మాటొకటుందే

మనసార నాకు వినబడుతోందే, ఆ ఆ ఆ ఆ

ఒంటరయ్యి నువ్

ఒంటరయ్యి నువ్ ఒల ఒల ఏడ్చుతుంటె

నీ మనసు లోపలా

ఉన్నగాని నే, ఉన్నగాని నే

ఓదార్చలేనులే దరిచేరి నిన్ను జన్మలా

Bullet Bandi laxman Song lyrics in telugu

ఎవరే నిన్ను నన్ను ఎడబాపింది

దూరమైపోయినామె ఓర్వక మంది

నిన్ను మా రాణిలా చూడనన్న నా తలా

చూడలేకపోతున్న తలరాతనా ఎలా

నువ్వు నవ్వుతున్న నవ్వులోన కన్నీళ్లున్నయే

కళ్ళార నాకు కనబడుతుందే

నీ మనసులోన నలుగుతున్న మాటొకటుందే

మనసార నాకు వినబడుతోందే, ఆ ఆ ఆ ఆ

సిన్నబోయి నువ్, సిన్నబోయి నువ్

సిత్తురంగా నలుగుతు ఉంటె మనుసులోపలా

చెప్పలేనే నే, చెప్పలేనే నా

బాధ ఎంతుంటదో నీపైన గుండెలోపలా

కట్టుకున్నోడే నిన్ను కంటతడిపెడితే

అది విని చస్తున్నానే తట్టుకోక నేనే

నువు నన్ను వీడలే, నేను ఎప్పుడోడలే

ఎంతదూరమైన ఒకరి ప్రాణమొకరమే

నువ్వు నవ్వుతున్న నవ్వులోన కన్నీళ్లున్నయే

కళ్ళార నాకు కనబడుతుందే

నీ మనసులోన నలుగుతున్న మాటొకటుందే

మనసార నాకు వినబడుతోందే, ఆ ఆ ఆ ఆ

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *