online premina offline premina jarigedi ide kada story in telugu ఆన్లైన్ ప్రేమైన offline ప్రేమైన జరిగేది ఇదే కదా …
ఒకసారి బస్సులో Medak నుండి హైదరాబాద్ కి వెళ్తున్నాను…నా పక్కన సీట్లో ఒక అమ్మాయి మొహానికి స్కార్ఫ్ వేసుకొని ఉంది…ఇంతలో ఒక అబ్బాయి వచ్చి ఆ అమ్మాయి పక్క సీట్లో కూర్చున్నాడు…ఇద్దరు ప్రేమికులు అనుకుంటా…!?
ఒక పది నిమిషాల తర్వాత నాకు అర్ధం అయ్యింది ఏంటంటే వాళ్ళిద్దరికీ అసలు పరిచయమే లేదని…ఆ అబ్బాయి మాత్రం ఈ జర్నీలో ఆ అమ్మాయిని ఎలా అయినా ఇంప్రెస్స్ చెయ్యాలని ఏవేవో చేస్తున్నాడు…మీ వాయిస్ బాగుంది అని చెప్పాడు, ఎక్కడికి వెళ్తున్నారో అని అడిగాడు, ఏమ్ చేస్తుంటారో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు…
కానీ ఆ అమ్మాయి మొహానికి ఉన్న స్కార్ఫ్ మాత్రం తీయించలేకపోతున్నాడు…చివరికి జర్నీలో ఒక గంట సమయం గడిచిపోయింది…
WHAT IS REAL LOVE story in Telugu
ముందు స్నేహం అన్నాడు, చివరికి ప్రేమిస్తున్నా అని చెప్పనే చెప్పేశాడు…అసలు ఎవరో తెలియదు, ఒకరికి ఒకరు పరిచయం లేదు, ఓ గంట ముందు బస్సులో చూసుకున్నారు అంతే… ఏవో రెండు మాటలు మాట్లాడి ప్రేమిస్తున్నా అని ప్రపోజ్ చేసేసాడు…ఇదంతా చూసి నవ్వుకుంటూ ఉన్నా…
ఆ అబ్బాయి ప్రపోజ్ చేసిన నిమిషానికి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని కొన్ని ప్రశ్నలు అడిగింది…నాలో ఏమ్ నచ్చింది నీకు ? అబ్బాయికి ఏమ్ కనిపించిందో మంచితనం అన్నాడు…
అమ్మాయి: మీరు నన్ను చూడలేదు కదా ఒకవేళ చూశాక నచ్చకపోతే ఏంటి పరిస్థితి అని అడిగింది…!?
అబ్బాయి: మీ VOICE నాకు నచ్చింది అండి…మీ రూపం కూడా చాలా బాగుంటుంది అని ఆ అబ్బాయి సమాధానం ఇచ్చాడు…
ఈ రెండు ప్రశ్నల అడిగిన తర్వాత ఆ అమ్మాయి మొహానికి ఉన్న ముసుగు తీయడం మొదలుపెట్టింది…ఆ అబ్బాయిలో ఆతృత కనిపిస్తుంది…నేను కూడా ఇద్దరిని అలాగే చూస్తున్నాను…ఒక నిమిషం నన్ను నేనే నమ్మలేక ఏదో లోకంలో వెళ్ళిపోయాను…!!
సీట్ లో ఉన్న అబ్బాయి మొహంలో భయం, అమ్మాయి మొహం ఒక వైపు మొత్తం కాలిపోయి ఉంది…కానీ రూపం మాత్రం ఆకాశంలో మెరిసే చందమామ లాగా కళగా ఉంది…ఇప్పుడు చెప్పు ఐ లవ్ యూ అని ఆ అమ్మాయి అడిగింది…అబ్బాయి ఏమో అది అది అనుకుంటూ కంగారుపడుతూ నా స్టాప్ వచ్చింది బాయ్ అని చెప్పి హడావుడిగా బస్ దిగేశాడు… మంచితనం అన్నాడు, వాయిస్ బాగుంది అన్నాడు చివరికి అందానికి ఇంపార్టెన్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు…
True Love Proposal in Telugu
ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే ఎందుకో తన జీవితంలో జరిగిన సంఘటన గురించి తెలుసుకోవాలి అనిపించింది…వెళ్ళి పక్కన కూర్చున్నా…ఏంటి మీకు కూడా నా వాయిస్ నచ్చిందా అంది…. అదేం లేదమ్మా ఒక అన్నయ్యగా నీ పక్కన కూర్చుంటే ఇంకా వేరే ఎవరు నీ పక్కన కూర్చోరు కదా అన్నాను…కొద్దిసేపటికి తర్వాత తన గతం చెప్పింది…తన స్టాప్ వచ్చింది సరే అన్నయ్య బై చెప్పి వెళ్ళింది… తన గతం విన్నా నేను ఏమో బరువెక్కిన గుండెతో దీనంగా అలా కూర్చుండి పోయా…
Men Prority
Online love, offline love, Men always give priority to beauty what do you say guys …..
$BN
NIJAMINA PREMANTE IDE
https://www.instagram.com/reel/C8eLYkYx0fW/?utm_source=ig_web_copy_link&igsh=MWp5ZThnZnQyejZtbg==