Dappu mahender icon of the dappu in telugu

Dappumahender Life Journey in next part …. #Dappumahender ఆదిమ మనిషి మొదట వినింది తన గుండె చప్పుడు…

తన గుండె చప్పుడు. ఆ గుండె చప్పుడే కాలంతో డప్పు అయ్యింది. మాదిగ గూడెం మట్టిలో చర్మానికి జీవం పోసే చేతుల్లో వృత్తి కాదు అది వంశపారంపర్య శ్వాస. ఎండలో ఎండిన తోలు

చంద్రుడి కాంతిలో మృదువై మ్రోగే గుండెగా మారినప్పుడు ఒక వాద్యం కాదు పుట్టింది. ఒక జాతి చరిత్ర మేలుకుంది. డప్పు గొడుగు కట్టిన నడుము వీరుడి కవచంలా మెరుస్తుంది. భుజం మీద తగిలే ఆ బిగింపు యుద్ధానికి సిద్ధమైన వీరుని తాటికట్టులా.

కర్ర దెబ్బ కాదు అది

కాలాన్ని లేపే

వేళ్ల సవ్వడి కాదు అది

భూమి శ్వాసను మేల్కొలిపే మంత్రం. ఒక చేయి పిడికిలి దరువు మరొక చేయి పలుకు దరువు

మధ్యలో గాలి కంపిస్తుంది ఊరు మొత్తం ఒకే హృదయంగా మారుతుంది.

పండుగ మొదలు పెట్టేది డప్పే పోరాటం పిలిచేది డప్పే చావు వార్త చెప్పేది డప్పే పుట్టిన శిశువుకు

జీవ గీతం పలికేది కూడా

                                                              డప్పే.

Dappu mahender icon of the dappu in telugu

అది శబ్దం కాదు

ఇప్పుడు సమానత్వ నినాదంగా మారింది. డప్పు చర్మం మీద పడే ప్రతి దెబ్బ వేదన కాదు

అవమానాల మీద గెలిచిన గర్వ గర్జన. ప్రతి దరువు చెబుతుంది:

“మేమున్నా

మేమే ఈ నేల గుండె చప్పుడు.”

డప్పు మ్రోగితే

కాలం ఆగి వింటుంది.

నా కళని అవమానించిన వేలాదిమందిలో,
మీ అక్షరాలు నాకెంతో ధైర్యాన్ని నింపాయి అన్న.. హృదయ పూర్వక ధన్యవాదాలు Daramalla Ramesh Daramalla అన్న

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *