ఎఎంహెచ్ఎఎన్ఎస్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ (ఎన్ఎంహెచ్ఎఎన్ఎస్) జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికే షన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్య ర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 10.
ఖాళీలు: 04 (జూనియర్ రీసెర్చ్ ఫెలో). ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎం.ఫిల్ తోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి : 40 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరి మితి సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ : ఫిబ్రవరి 10.
సెలెక్షన్ ప్రాసెస్ : షార్టిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు
www.
nimhans.ac.in వెబ్సైట్ను సందర్శించండి.
