Uchitha Vidya Gurukula Patashalao Dont Missmore

Uchitha Vidya Gurukula Patashalao Dont Miss ఉచిత విద్య ఎవరైతే చదువుకునే స్తోమత లేకున్నా మీకు ఉత్సహంగా ఉన్న తొందరగా అప్లై చేసుకోండి సీట్ పొందండి 6 నుంచి 10 వ తరగతి వరకు ఉచితంగా ఉన్నతమైన విద్యను పొంది మీ భవిషతుకు  బంగారు బాటలు వేసుకోండి పూర్తి వివరాలు కింద చుడండి

గురుకుల సీట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఐదు నుంచి తొమ్మిదో తరగతి వరకు మిగిలిన సీట్లకు అర్హత గల విద్యార్థులు ఈ నెల 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని గురుకుల సంస్థల జిల్లా సమన్వయ అధికారి పోలోజు నరసింహచారి ప్రకటనలో కోరారు. జిల్లాలో ని చేర్యాల, వర్గల్, కోహెడ, చిన్నకోడూరు, అల్వాల్, దుబ్బాక, హుస్నాబాద్ బాలికలు పాఠశాల, ములుగు, జగదేవ్ పూర్, గజ్వేల్, సిద్దిపేట రూరల్, రామక్కపేట, మిట్టపల్లి, తొగుట, బెజ్జంకిలో ఐదు నుంచి తొమ్మిదో తరగతి వరకు మిగిలిన సీట్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. టీజీ సీఈటీ

Free Education from 6th to 10th in Gurukulam

పరీక్షలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని, పరీక్ష రాయని విద్యార్థులకు డ్రా పద్ధతిలో అవ కాశం ఉంటుందన్నారు. విద్యార్థులు తమ దరఖాస్తులను ఈ నెల 16 సాయంత్రం 5గంటల లోగా చేర్యాల పట్టణంలోని గురు కుల విద్యా సంస్థలో లేదా తమ సమీపం లోని గురుకుల విద్యాలయంలో ప్రిన్సిపా లక్కు అందజేయాలన్నారు.

ఈ నెల 18న చేర్యాల గురుకులంలో కౌన్సెలింగ్ తో పాటు డ్రా నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, క్యాస్ట్, ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, టీజీసీఈటీ హాల్ టికెట్లు మూడు జిరాక్స్ సెట్లతో ఉదయం 10గంటల్లోపు హాజరుకావాలని కోరారు.

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *