integrity

నిజాయితీ ఎంత గొప్పదో ఈ కథ చదివితే తెలుస్తుంది అనగనగా ఓ పట్నం. అక్కడ కృష్ణయ్య  ,లచ్చుమయ్యఅనే ఇద్దరు పెద్ద వ్యాపారులు ఉండేవారు. నువ్వా నేనా అన్నట్లు వారి మధ్య ఎప్పుడూ పోటీ ఉండేది. వీరయ్య దగ్గర పనిచేసే గుమస్తా గంగులు… తనకు జీతం కాస్త పెంచమని ఎన్నో నెలల నుంచి యజమానిని అడుగుతున్నాడు.

కానీ, ఆయన మాత్రం చూద్దాం చేద్దాం అంటూ ప్రతి నెలా దాటవేయసాగాడు. దీంతో విసుగు చెందిన గంగులు… ఇక లాభం లేదనుకొని అక్కడ పని మానేశాడు. కొద్దిరోజుల తర్వాత అలవాటైన పని కావడంతో మరో వ్యాపారి కృష్ణయ్య  , దగ్గరకు వెళ్లాడు. విషయం మొత్తం చెప్పి… పని ఉంటే ఇవ్వమని అడిగాడు. తను ఎంత జీతం ఆశిస్తున్నాడో కూడా చెప్పాడు. ఆయన కాస్త ఆలోచించి… ‘కొద్ది

నెలల తర్వాత మళ్లీ జీతం పెంచమని అడగవనే గ్యారంటీ ఏంటి?’ అన్నాడు. ‘కుటుంబం గడవడం నిజాయతీ కష్టంగా అనిపిస్తే, అడగడంలో తప్పు లేదని

Nijayithi Entha Goppado ee kathalo Telustundi

అనుకుంటున్నానయ్యా…’ సమాధానమిచ్చాడు గంగులు. ‘అది సరే… మరి నిన్ను పనిలోకి తీసుకుంటే నాకేమైనా లాభం ఉందా?’ అని అడిగాడాయన. అర్థం కాలేదన్నట్లు ముఖం పెట్టాడు గంగులు. ‘నిన్ను పనిలోకి తీసుకుంటే, అక్కడి వ్యాపార రహస్యాలు ఏమైనా చెప్పగలవా?’ అని అడిగాడు. ‘అయ్యా… నిన్నటి వరకూ నాకు అన్నం పెట్టిన యజమానికి ద్రోహం చెయ్యలేను. నేను నీతి తప్పే మనిషిని కాదయ్యా, క్షమించండి’ అన్నాడు గంగులు.

ఆ జవాబుతో కృష్ణయ్య నవ్వుతూ… ‘శభాష్ గంగులూ… నీ నిజాయతీ నాకు నచ్చింది. ఈరోజు నుంచే నువ్వు పనిలో చేరొచ్చు. జీతం కూడా నువ్వు అడిగిన దానికంటే కాస్త ‘ ఎక్కువే ఇస్తాను’ అనడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడతను. ఆలస్యం చేయకుండా అదే రోజు పనిలో చేరాడు. మంచి పనివాడిని పోగొట్టుకున్నందుకు బాదపడ్డాడు లచ్చుమయ్య. అదండీ సంగతి సో మీరు నిజాయితీగ ఉండండి కదా…

CLICK HERE FOR QUOTE OF INTEGRITY

నిజాయితికున్న ఆ కిక్క్ వేరప్పా అన్నట్టుంది
by sailu

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *