Latest Evergreen Pelli Song lyrics in telugu1

Inthenemo Inthen emo Song Lyrics in Telugu adapilla pelli ai talligari inti nunchi atthhavarintiki veletappudu veedkolu song lyrics

ఇంతేనేమో ఇంతేనేమో

ఇంతవరకేనేమో..

ఈ ఇంట్లో నా కథ

అంతేనేమో అంతేనేమో

అంతులేని వేదనేమో

ఆడపిల్లను కదా

మళ్ళి తిరిగి అడుగేసేది

వచ్చి పోయే చుట్టంలానే

నేను పుట్టి పెరిగిన ఊరికి

ఇంకా పైన పొరుగూరిదాన్నే

కట్ట దాటి గంగా నేడు

కంట పొంగేనే

ఎంత ఎంత యాతనో

ఎంత గుండె కోతనో

ప్రాణమోలే పెంచుకున్న

పిచ్చి నాన్నకు

దూలం ఇరిగి భుజము ఫై

పడిన పిడుగుపాటిది

ఇంతకన్నా నరకమే లేదు జన్మకు

ఇంతేనేమో ఇంతేనేమో

ఇంతవరకేనేమో..

ఈ ఇంట్లో నా కథ

ఈ ఇంట్లో నీ కథ

Adapilla Pelli Veedkolu Song Lyrics

అంతేనేమో అంతేనేమో

అంతులేని వేదనేమో

ఆడపిల్లను కదా

అరచేతినే ఎరుపుగా

మార్చిన గోరింట కొమ్మ

నిన్నలా ఊగక రాల్చేను చెమ్మ

వాకిట నేనేసిన తొమ్మిది వర్ణాల ముగ్గు

విగటగా చూసేనే విడిపోయామా

గుంజేనే గుండెనే ఎవరో అన్నంతగా

వేదనే బాధనే నాన్నకు

గూడునే విడువకా ఇడ్నే ఉండొచ్చుగా

ఎవ్వడు రాసాడు ఈ రాతను

మొక్కుతోనే  నీ పాదాలు

కడిగినాయ్యి కన్నీళ్లు

రెక్కలల్లా దాసుకొని కాచినందుకిన్నాళ్ళు

మెట్టినింటా దీపమై నీ పేరు నిలుపుతనే

నీ మువ్వల గల గల

నువ్వు ఊగిన ఊయల

అరుగు పైన నువు నాకు

చూపిన వెండి వెన్నెల

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *