Budhhudila Bathikayadam Sulabam Mari Budhudu Bharyakatha inside

Budhhudila Bathikayadam Sulabam mari budhudu Bharya బుద్ధుడిలా బతికేయడం సులభం

బుద్ధుడి భార్యలా బతకగలరా

జ్ఞానం సంపాదించిన బుద్ధుడు తన భార్య బిడ్డను చూడడానికి వచ్చాడు భార్య ఇలా ప్రశ్నించింది

నన్ను వదిలి వెళ్లారు పరవాలేదు కానీ నాతో ఒక్క మాట చెప్పి వెళ్ళుండొచ్చు. నేను మీ ఆలోచనకు అడ్డు చెప్పి ఉండను కదా కానీ మీరు నన్ను నమ్మలేదు అన్నదే ఎక్కువ బాధ కలిగించింది. ఎందుకు నన్ను ఇలా బాధ పెట్టారని అడిగింది

బుద్దుడు తన భార్య దగ్గర క్షమాపణ కోరి నేను చెప్పకుండా వెళ్ళింది నీకు భయపడి కాదు నాకు భయపడి.నిన్ను బిడ్డను చూస్తే ఎక్కడ నా మనసు మారిపోతుందో అని చెప్పాడు

Budhudu bharya katha in telugu

భార్య మళ్ళీ ఒక ప్రశ్న అడిగింది ఈ రాజ్యాన్ని వదిలి వెళ్లకుండా ఇక్కడే మీరు ఆ జ్ఞానాన్ని సంపాదించ ఉండలేరా అని

నిజమే నేను కొండలు అడవులు ఆశ్రమాలు వెతుక్కుని వెళ్లాల్సిన పని లేదు కానీ ఇక్కడ నుండి వెళ్లేప్పుడు నాకు అది అర్థం కాలేదు అన్నాడు

అందరూ బుద్ధుడి గురించే మాట్లాడుతారు కానీ ఆయన భార్య యశోధర గురించి ఆలోచించరు

బుద్ధుడు వెళ్ళినట్టే తన భార్య అర్దరాత్రి గడప దాటి ఉంటే ఈ లోకం ఆమెను మంచిది అని చెప్పేదా??

లేచిపోయింది అని చెప్పి ఉండేవాళ్ళు,ఇప్పుడు కూడా అక్కడ వారు అనని మాటలు లేవు

పెద్ద వయసేమి కాలేదు అందంగా ఉంది ఇంత రాజ్యము ఆవిడ సొంతమే తనకు నచ్చినట్టు ఉండొచ్చులే అని నిందలేసింది

పసి పిల్లాడు నాన్న కోసం అడుగుతుంటే అర్థం కానీ అతనికి ఏమని చెప్పి సముదాయించిందో ఎంత పోరాడిందో

ఇవన్నీ వదిలేసి ఎటువంటి సమస్య లేకుండా సన్యాసం పుచ్చుకున్నాడు బుద్ధుడు

అన్నీ ఉన్నా సన్యాసిలానే బతికింది యశోధర

ఏది కఠినం ఏది కష్టం ఎవరు సన్యాసం పుచ్చుకున్నది చెప్పండి..

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *