Latest Folk song lyrics by Hanumanth singer
సావే వస్తలేదే
నేను సచ్చిపోతే బాగుండనుకుంటే
రానే వస్తలేదే
నాతో అయితలేదే నువ్వు వచ్చిపోతే
జూసిపోతా అనుకుంటే
నువ్వే వస్తలేవే
నా సక్కనైన దానికోసం
ఆ సుక్కలల్లో జేరిపోతా
ఏ ఒక్కరైన రాని లోకం
ఆ దిక్కులల్లో ఎల్లిపోతా
నేను సచ్చిపోతే నీకు సంతోషమైతే
జెప్పే ఓసారి
Latest Folk song lyrics by Hanumanth
నువ్ రాకపోతే ఉండను
నే నువ్ లేకుంటే ఎట్లుంటనే
నువ్ బాధపడితే సూడను
నే నిన్ను బాధలెట్ల పెడ్తనే
నువ్ రాకపోతే ఉండను
నే నువ్ లేకుంటే ఎట్లుంటనే
నువ్ బాధపడితే సూడను
నే నిన్ను బాధలెట్ల పెడ్తనే
గడపే దాటలేకపోతున్న
నా మొఖము సూపలేక నేనున్నా
కలిపేవారే లేక జూస్తున్న
నా కధను దాయలేక జెబుతున్న
నీ నవ్వులే కోరే నేనే
నవ్వులపాలై పోతి
నీ ప్రేమనే కోరి నేనే
ఇంతలా మోసపోతి
సీకటి యాలకే వస్తున్నానే
దొంగల నా ఇంటికి
తెల్లారే యాళ్ళకే
పోతున్నానే కనిపించకే కంటికి
నువ్ రాకపోతే ఉండను
నే నువ్ లేకుంటే ఎట్లుంటనే
నువ్ బాధపడితే సూడను
నే నిన్ను బాధలెట్ల పెడ్తనే
నువ్ రాకపోతే ఉండను
నే నువ్ లేకుంటే ఎట్లుంటనే
నువ్ బాధపడితే సూడను
నే నిన్ను బాధలెట్ల పెడ్తనే
అడుగే వేయలేక నిల్సున్న
ఓ గదిలో బంధీలాగా కూసున్న
కలిసే రాతే లేక తెలిసున్న
ఓ నదిలా రంది నాలో ఎంతున్నా
నా దారిలో నువ్ రాకే
మన్నులో మన్నై పోతే
నీ సూపులో కానరానే ఎన్నడూ
ఈ జన్మలో ఎళ్ళిపోతే
- Aalu Magalu Song Lyrics in Telugu Latest Folk

- Shivaji vs Anasuya Counters in Telugu

- Pani Dorakani Pilladu Inspirational Story in Telugu

- Raambhai Director Sailu Life style Biography in Telugu

- Meedi a kulam anadigite ichina samadanam wow

ఊరంతా కోడై కూస్తున్నాదే
చేయని ఏ తప్పుకీ
నమ్మేంత నాపై చూపిస్తివే
ప్రేమను నీవంతుకి
నువ్ రాకపోతే ఉండను
నే నువ్ లేకుంటే ఎట్లుంటనే
నువ్ బాధపడితే సూడను
నే నిన్ను బాధలెట్ల పెడ్తనే
నువ్ రాకపోతే ఉండను
నే నువ్ లేకుంటే ఎట్లుంటనే
నువ్ బాధపడితే సూడను
నే నిన్ను బాధలెట్ల పెడ్తనే

