kula pariksha wow answers in telugu Meedi a kulam anadigite ichina samadanam wow

Meedi a kulam anadigite ichina samadanam wow answers in telugu a very big shock to vilekari find below how sweet reply : kula pariksha wow answers in telugu

kula pariksha wow answers in telugu

విలేఖరి : సార్ మీది ఏ కులం???? నేను : ఏ వయస్సు లో…

విలేఖరి : అంటే వయస్సు బట్టి కులం వుంటుందా???

నేను : వుంటుంది! బాల్యంలో బాలకులం

యవ్వనంలో యువకులం వృద్ధాప్యంలో పండుటాకులం

రాలిపోయే ఎండుటాకులం

విలేఖరి : అది కాదు మామూలుగా మీది ఏ కులం???

నేను : ఎవరూ లేకుంటే ఏకాకులం ప్రేమలో వున్నప్పుడు ప్రేమికులం పెళ్లి అయ్యాక సంసారికులం

కానప్పుడు బ్రహ్మచారికులం

విలేఖరి : అది కాదండీ కమ్మ కాపు ఆలా

మీది ఏ కులం

నేను : ధనముంటే దనికులం లేకుంటే బీదకులం దేవుణ్ణి నమ్మితే

ఆస్తికులం

నమ్మకుంటే నాస్తికులం

విలేఖరి : మీకు ఆసలు కులం లేదా ????

నేను : ఎందుకు లేదు

ప్రయాణిస్తే ప్రయాణికులం

How Many Castes in the World

యాత్రలు చేస్తే యాత్రికులం

మాయలు చేస్తే మాంత్రికులం

ఉపన్యసిస్తే ఉపన్యాసకులం

హాస్యం పండిస్తే విధూషకులం

 పాడితే గాయకులం సభలో ఉంటే సభికులం

సినిమా హాల్లొ ప్రేక్షకులం

టీవీ ల ముందు వీక్షకులం

విలేఖరి : మీరు ఎక్కడ చదివారు????

నేను : చదివింది గురుకులం

అభ్యసిస్తే అభ్యాసకులం

బోధిస్తే బోధకులం

వృత్తిరీత్యా అధ్యాపకులం

పత్రికల పాఠకులం

విలేఖరి : అసలు మీరు ఎవరండీ ఇలా చంపుతున్నారు????

నేను : నాగరికత నేర్పిన నాగరికులం

నాయకులని నమ్మే అమాయకుల

మూఢత్వం పోని మూర్ఖులం

విలేఖరి : అసలు మీ వయస్సు ఎంతండి బాబు????

True Love Ki Evi Adduravu kulam in Telugu

నేను : కొందరికి పూర్వీకులం

మరికొందరికి సమకాలికులం

ప్రస్తుత వర్తమానికులం

విలేఖరి : అసలు మీది ఏ దేశం? ??

నేను : భరత జాతి వంశీకులు భావి భారత రథసారథికులం…

విలేఖరి : మీకు దణ్ణం రాంబాబు ఇంకెప్పుడు ఎవరిని మీది ఏ కులం అని మాత్రం అడగను…

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *