Bhanu NN Unique Style Songs and Vocabulary in Telugu పేదింటి పాటగాడు Bhanu NN Unique style Songs తనదయిన బాణీ లో అందరిలా కాకుండా కొత్తగా తన పల్లెటూరి బాషలోనే పాటలు రాసి అందరి మెప్పు తో ముందుకు వెళ్తున్నారు కొత్తగా అంటే ఈ madya కాలంలో రాసిన రామాలచ్చిమి పాట ను చుస్తే అర్థమైతది …
He has written so many songs and given to others to survive his life now he has his own production Varadhi Productions all of you people do support him….
He is Multitalented
singer ,Writer, Director ,Actor,Editor and influencer etc...
check his insta Bhanu nn and know what
తన పేదరికంతో జాలువారిన అలల పొంగే మాటలు ,పాటలు ఎన్నో వేళ పదాలు ,జనంలో మార్పు తెచ్చే మాటలు మనసుకు ఉల్లాసంగా ఉండే పాటలు తన యొక్క ఉనికిని చాటిన గ్రేట్ భాను మరింత సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లండి ..కష్టపడే ప్రతి ఒక్కరిని ఆదరించండి
అతడికి చిన్నప్పటి నుంచే పాటలంటే ప్రాణం.. అందులో జనపదం అంటే ఎనలేని ఇష్టం.. అ ఇష్టమే అతడిని కళారంగంవైపు నడిపించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడు ఉన్నత చదువులు చదువుకోలేకపోయినా.. ఓవైపు మెకానిక్ గా పనిచేస్తూనే మరోవైపు తనలోని అంతరంగాన్ని పాటల రూపంలో ఆవిష్కరించాడు. పాటల రచయితగా… సింగర్‌గా. డైలాగ్స్ రైటర్‌గా గుర్తింపు పొందాడు. తనలాంటి ఎందోమంది కళాకారులకు చేయూతనిస్తూనే ఏకంగా వారధి ప్రొడక్షన్స్ పేరిట ఇప్పుడు సొంత చానల్ ద్వారా కళామతల్లి సేవలో తరిస్తున్నాడు.
- Kantininda kanneellu unna folk song lyrics in telugu
- Inthenemo Inthenemo Song Lyrics in Telugu
- Pelli Song Lyrics in Telugu English Version
- Part Time Full Time Data Entry Jobs in all Areas
- kurnool Todays Kaveri Travels Incident
పేదింటి పాటగాడు Bhanu NN Unique style Songs
నాటి పూర్వ కరీంనగర్, నేటి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామానికి చెందిన నేదునూరి ఎల్లవ్వ, మల్లయ్య దంపతుల కొడుకు నేదునూరి భానుచందర్‌కు చిన్నతనం నుంచే పాటలు వినడమన్నా.. పాడడం అన్నా ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే ఓవైపు పాటలు పాడుతూ మరోవైపు సొంతంగా పాటలు రాసేదాకా ఎదిగాడు. నిరుపేద కుటుంబానికి చెందిన భానుచందర్ అష్టకష్టాల నడుమ పదో తరగతి వరకు చదువుకుని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా పై చదువులు చదవలేకపోయాడు. కానీ, తనకు ఇష్టమైన కళారంగాన్ని నమ్ముకొని ముందుకు సాగాడు. మెకానిక్ గా పనిచేస్తూ తన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూనే క్రమంగా పాటలు రాయడం, పాడడం కొనసాగించాడు. మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన జానపద కళాకారుడు మాట్ల తిరుపతి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి తన ప్రస్థానాన్ని
మొదలుపెట్టాడు. ‘కళారంగంలో అది నా మొదటి ప్రయాణం.. మాట్ల తిరుపతన్న వద్ద (sytv) అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన. కరోనా సమయంలో వెనుదిరిగి రావాల్సి వచ్చింది. తర్వాత ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు తలెత్తినయ్. ఒక్కసారిగా భవిష్యత్తు తలకిందులైనట్టు అనిపించింది. అప్పుడు అక్క సరిత నారగోని ఇచ్చిన ధైర్యంతో పాటలు రాయటం కొనసా గించిన. మాట్ల తిరుపతన్నతో చేసిన ప్రయాణంలో నేను పొందిన అనుభవం నన్ను పదాలను ఎలా ఒడిసి పట్టుకోవాలో నేర్పించింది. అప్పుడు పూట గడవడం కోసం 100కు పైగా నేను రాసిన పాటలు అమ్ముకున్న.
Bhanu NN Unique style Songs Ramalachimi
మొత్తంగా 200కు పైగా పాటలు రాసిన. 80కి పైగా పాటలకు దర్శకత్వం వహించిన. వేరేవాళ్లకు చెందిన 45కి పైగా పాటలకు ట్యూన్ కట్టిచ్చిన. ఈ రంగంలో ఎలాంటి సపోర్ట్ లేనివాళ్లకు దారి చూపించిన. కొత్తగా వారితో చానల్ పెట్టించి దారి పేరు నుంచి మొదలు అది సోషల్ మీడియా వేదికపైకి వచ్చేదాకా దగ్గరుండి చూసుకున్న. అలా నాలుగు చానళ్లను ప్రారంభించిన

Bhanu NN
* బైక్ మెకానిక్ నుంచి రైటర్, సింగర్ చిన్నతనం నుంచే కళారంగంపై అభిమానం • జానపదంలో అంచెలంచెలుగా పైకి.. • డైలాగ్స్ రచయితగానూ గుర్తింపు * వారధి ప్రొడక్షన్స్ చానల్ ద్వారా జనంలోకి.. కళామతల్లి సేవలో కల్లెపల్లి కళాకారుడు భానుచందర్
Bhanu Chander Tana Gurinchi Tana Matalu Ila…
నాకు డైలాగ్స్ రాయడం అంటే పిచ్చి. కొన్ని వేలక పైగా డైలాగ్స్ రాసిన వాటిని విన్న ప్రతిఒక్కరూ స్ఫూ పొందారు. ‘అన్న మీ డైలాగ్సతో మా లైఫ్ కూడా మారింది. విడిపోయిన వాళ్లం కలుసుకున్నం’ అ చెప్తుంటే ఎంతో ఆనందం అనిపించేది. ఆ ఆనంద మాటల్లో చెప్పలేను. ఇప్పటికీ ఈ ఫీల్డ్‌లో నన అందరూ డైలాగ్ కింగ్ అని పిలుస్తుంటే ఎంత సంతృప్తి అనిపిస్తుంటుంది.
రీసెంట్ గా ‘వారది ప్రొడక్షన్స్’Varadhiproductions“పేరిట కొత్తగా చానల్ పెట్టిన. చాన ద్వారా నేను రాసి దర్శకత్వం వహించి చిత్రీకరిం విడుదల చేసిన ‘రామలచ్చిమి‘ పాటతో నలుగురి పరిచయమైన. అది నాకు ఎంతో గుర్తింపు తెచ్చింది నేను రాసిన వాటిలో పదికి పైగా పాటలు నన జనాల్లోకి తీసుకెళ్లాయి. వారికి దగ్గర చేశాయి. నేను రంగంలో రాణించాలని అనుకున్నప్పుడు పడ్డ కష్టాల కొత్త వాళ్లు ఎవరూ పడకూడదన్న ఉద్దేశంతో ఇప్పు ఎవరు కొత్తగా ఈ రంగంలోకి వచ్చినా వారి ప్రోత్సహిస్తున్న. మా చానల్ ద్వారా కొత్తవాళ్లకి అవకాశం కల్పిస్తున్న.
- Kantininda kanneellu unna folk song lyrics in telugu
- Inthenemo Inthenemo Song Lyrics in Telugu
- Pelli Song Lyrics in Telugu English Version
- Part Time Full Time Data Entry Jobs in all Areas
- kurnool Todays Kaveri Travels Incident
ఈ ఫీల్డ్‌కు దగ్గరగా ఉండాలని ఉద్దేశంతో నా పేరును Bhanu NN గా మార్చుకున అంటూ తన అనుభవవాలను వివరించాడు భాన ఇప్పటివరకు తాను రాసిన పాటల్లో ‘రామలచ్చిమి ‘జడివాన’, ‘నిన్ను మెచ్చినోన్ని’ తదితర పాటల జనబాహుళ్యంలో ప్రచారం పొందాయి. ఒక్కో పాటన 30 నుంచి 40 లక్షల మంది ప్రేక్షకుల దా వీక్షించడమే భాను ప్రతిభకు తార్కాణంగా నిలిచింది.
కష్టపడే ప్రతి పేద బిడ్డకు తానొక స్ఫూర్తి (He is an inspiration to every poor child who struggles.)

