Unnavadu Medamida Medalenno kattutunte songmore

Unnavadu Medamida Medalenno kattutunte song పాట పాడుకోవడానికి బాణీ బాగుంది. అయితే… ఇప్పుడు భారతదేశం నిజంగా వెలుగుతుంది వెలుగుతుంది. ప్రపంచ దేశాల తో అగ్ర రాజ్యాల తో పోటీ పడుతుంది. అమెరికా రష్యా లతో సమానంగా వెలుగుతుంది. ఆర్థిక వ్యవస్థ లో మూడవ స్థానంలో ఉంది. ఎవరూ తమ దేశాన్ని కించపరుచుకోరు. ఈరోజు అమెరికా లో ఏ రంగంలో చూసినా మన దేశస్తులే అగ్రస్థానంలో ఉన్నారు. జైహింద్ జై భారత్…. find other Latestfolks also

ఉన్న వాడు మేడమీద మేడలెన్నో కట్టుతుంటే

పేదవానికి ఉన్ననీడ నేలకూలి చెదురుతుంటే

ఇదేనా దేశంమారిన తీరు చూడవే పేదల ఆకలిపోరు

రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే

అడగవే అమ్మా ఈభరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మ

కలిగినోల్ల కలికిమేడ మేడకెదుటె మురికివాడ

కారులోనా దొరలజోరు కాలెకడుపుతొ తిరిగునోకరు

ఇవేనా మార్పుకు ఆనవాల్లు అప్పులతొ నెత్తిన ఎత్తిరి రాళ్ళు

కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే

అడగవే అమ్మా ఈభరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మ

కర్మకాలి వ్యాదులొస్తే ఖర్మకాండే గగనమాయె

మద్యతరగతి మనిషిబ్రతుకు దవాఖానలొ దహనమాయె

ప్రాణముకు విలువన్నదె లేదమ్మ ఓటుకే పరిమితమైనది జన్మ

మార్పకు పునాదోలె ఈశవాలన్ని వేస్తారో అడగవే

అడగవే అమ్మా ఈభరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మ

చివరిదశలో ప్రజాస్వామ్యం చెదిరిపోయే ప్రజాస్వప్నం

అడగవే అమ్మా ఈభరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మ

చిగురుతొడిగె దశలొదేశం శిథిలమోతున్న మాటసత్యం

అర్థమే లేనిది భారత అవని రుణాలకు పెట్టిన పేరైందమ్మ

స్మశానమైన ప్రశాంతమైతో మనదేశము ఘోరమే

అడగవే అమ్మా ఈభరతదేశం వెలుగుతుందట అడగవే అమ్మ

నేనడిగితె ఎన్ కౌంటరు నేనడిగితే ఒకపీడీ ఆక్టు

నేనడిగితే ఒక ఊపాకేసు నేనడిగితె ఒక అర్భన్ నక్సలైటు

మీరడిగితే ఏమంటరో అడగవే అమ్మ

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *