Etthuku Pi Ethuu Katha in Telugu 2026
ఒక ఊరిలో సోమయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ఒక సంవత్సరం వర్షాలు లేక చెరువులూ, పొలాలన్నీ ఎండిపోయి ప్రజలంతా అల్లాడిపోసాగారు. అయితే, ఆ వ్యాపారి మామిడి తోట సమీపంలోని చెరువులో కొంత నీరుంటే, డ్రమ్ముల్లో తరలించి తోటను కాపాడుకోగలిగాడు.
ఆ కరవు పరిస్థితులను అవకాశంగా మార్చుకొని, ఒక్కో మామిడి పండును రెండొందల రూపాయల చొప్పున అమ్మసాగాడు. ధర మరీ ఎక్కువని ఎవరైనా ప్రశ్నిస్తే.. కరవులో అలాగే ఉంటుందని బదులిచ్చేవాడు. ‘డబ్బు లేనివాళ్లు, రుణపత్రాలు రాసి పండ్లు తీసుకెళ్లొచ్చు. వచ్చే ఏడాది పండిన పంటల్లో ఆ బాకీని వసూలు చేసుకుంటాను’ అంటూ ఊరిలో చాటింపు వేయించాడు.
- Great Women Story in Telugu Happy Womens Day
- Chandra Grahana Timings According to India
- Etthuku Pi Ethuu Katha in Telugu 2026
- Valentine Week Stories Quotes in Telugu
- Taggina Perigina Daralu Kotha Budget
గత్యంతరం లేక ఊరి వాళ్లంతా పండ్లు పట్టుకెళ్లారు. అదే అదునుగా తన ఇష్టం వచ్చినట్లు వడ్డీ వేసి వాళ్లతో పత్రాలు బాగా కురిసి రాయించుకున్నాడు. మరుసటి ఏడాది వర్షాలు తోటలూ, పొలాలూ కళకళలాడాయి. తనకు రుణపత్రాలు రాసిచ్చిన వారి పంటనంతా సోమయ్యే తరలించుకొని వెళ్లి పోయాడు. దాంతో వాళ్లంతా గ్రామాధికారికి ఫిర్యాదు చేశారు.
తెలుగు 2026లో ఎత్తుకు పై ఎతు కథ
ఆయన వ్యాపారిని పిలిపించి, ‘నువ్వు వేసిన వడ్డీకి వీళ్ల అప్పు తీరాలంటే జీవితం సరిపోదు. ఎంతోకొంత తీసుకొని వాళ్ల రుణాలన్నీ మాఫీ చెయ్యి’ అని చెప్పాడు. వ్యాపారి వినకపోవడంతో ‘అలా అయితే ఇంకో లెక్క కూడా తేలాల్సి ఉంది. కరవుతో ఊళ్లోని పంటలన్నీ ఎండిపోతే… నీ మామిడి తోట మాత్రమే ఎలా కాసింది? చెరువు నీటిని డ్రమ్ములతో మోసుకెళ్లడంతోనే కదా? అలాగైతే నువ్వే మన ఊరి జనానికి బాకీ పడ్డావు’ అన్నాడు గ్రామాధికారి. బిక్కమొహం వేశాడు వ్యాపారి.
- Kathalu Vintara in Telugu lo-Enjoy listening to wonderful stories
- 30 నిమిషాల్ల పనికి 20,000 డాలర్ల బిల్లు ఎలా ?
- Cheppudu Matalu chinna katha in telugu 2024
- O Tandri Dairy lo chivari page to son
- Inspirational Story in Telugu for Bussiness
‘చెరువు నీరు ఊరి ఆస్తి. కాబట్టి డ్రమ్ముకు వంద రూపాయల చొప్పున లెక్కకట్టి ప్రజలందరికీ పంచాలి’ అన్నాడు. ‘ఒక్క డ్రమ్ముకు వంద రూపాయలా?’ అంటూ వ్యాపారి డీలాపడగా, ‘కరవులో ధరలు అలాగే ఉంటాయి’ అని బదులిచ్చాడు గ్రామాధికారి. మరో మార్గం లేని సోమయ్య.. ఊరి ప్రజల రుణాలు మాఫీ చేయడంతోపాటు వాళ్ల పంటలకూ డబ్బు చెల్లించాడు.

