Dhanam moolam idham jagath in teluguMO...

Dhanam Moolam Idham Jagath in Telugu ధనం  $$$. . .  Moolam Idham Jagath Antaru Ga So Ela Chuddam Randi  మూలం ఇదం జగత్ అంటారు గ సో ఎలా చూద్దాం రండి ….

ప్రపంచాన్ని నడిపే ఇంధనం . .

 నోరు లేకున్నా పలికిస్తుంది,

 కళ్ళు లేకున్నా శాసిస్తుంది . .

చేతులు లేకున్నా ఆడిస్తుంది,

 కాళ్ళు లేకున్నా నడిపిస్తుంది . .

 ఉన్న బంధాలను తెంచేస్తుంది,

 లేని బంధాలను కలిపిస్తుంది . .

 నవ్వుల వెనుక నిజాన్ని దాచుతుంది,

బంధాల బంధుత్వాల వల్ల పొందే ఉచిత సహాయాన్ని మరవకండి అది దన సహాయం కన్నా మిన్న….

బంధాలు అది ఏ బంధమైనా  అన్న, తమ్ముడు, చెల్లి, అక్క ఎవరైనా మన తోబుట్టువులని సహాయం చేస్తే అది మరిచి మీరు డబ్బుతో లెక్క పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి దీనిపై మీ కామెంట్ తప్పకుండ షేర్ చేయండి….

ఇంకా తెలుసుకుందాం….

 నిజాల ముందు ముసుగు కప్పుతుంది . .

 శత్రువులను పెంచుతుంది,

 స్నేహాలను పరీక్షిస్తుంది . .

 అధికారానికి అహంకారాన్ని నేర్పుతుంది,

అహంకారానికి ఒంటరితనాన్ని ఇస్తుంది . .

మనశ్శాంతిని దోచుకుంటుంది,

 నిద్రను అప్పుగా తీసుకుంటుంది . .

 కోరికలకు ఆకారం ఇస్తూ,

 తృప్తిని మాత్రం దూరం చేస్తుంది . .

 కానీ గుర్తుపెట్టుకో . .

ధనం అవసరం,

అది లక్ష్యం కాదు . .

 లక్ష్యమైతే

మనిషి మనిషిగా మిగలడు . .

మనసు లెక్కలుగా మారుతుంది,

 మనవత్వం లాభనష్టాల్లో కరిగిపోతుంది . .

 ధనం చేతిలో ఉంటే సాధనం,

 తలలోకి ఎక్కితే శాసనం . .

మనిషి ధనాన్ని నడిపించాలి,

     ధనం మనిషిని కాదు . .

Good One

విలువ తెలియనప్పుడు

విలువైన వస్తువు నీ దగ్గర ఉన్నా,

 విలువైన మాటలు నీ చెవి విన్నా,

విలువైన మనుష్యులు నీతో ఉన్నా

పెద్దగా ప్రయోజనం ఏం ఉండదు

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *