మీరు గోర్లు కొరుక్కుంటున్నార ఒకసారి చుడండి

Gorlu Cheppe Arogyam in Telugu గోళ్ళు చెప్పే ఆరోగ్యం మీరు గోర్లు కొరుక్కుంటున్నార ఒకసారి చుడండి

లోకంలో రెండు రకాల పేషెంట్లు కనిపిస్తారు. అనారోగ్యానికి సంబంధించిన ఏ చిన్న లక్షణం కనిపించినా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు ఒక రకమయితే ఎన్ని లక్షణాలు (Symptoms) కనిపించినా నిర్లక్ష్యం వహించి ఆఖరుకు వ్యాధి మీద పడ్డాక కంగారుగా డాక్టరు వద్దకు పరుగు తీసేవాళ్ళు రెండోరకం.

మొదటి రకంలో మరీ జాగ్రత్త కలవాళ్ళు రోజూ ఉదయాన అద్దం ముందు నిలబడి నోటిని తెరచి నాలుకను చూసుకోవటమో, కళ్ళను పరీక్షగా చూసుకోవటమో, స్త్రీలయితే వక్షోజాలను నొక్కి గడ్డలేమైనా ఉన్నాయేమో చూసుకోవటమో లాంటి జాగ్రత్తలను ప్రదర్శిస్తుంటారు. పురుషులు వృషణాల్ని పరీక్ష చేసుకుంటారు.

అన్నింటిలోకి వృషణాలు, వక్షోజాల్ని పరీక్ష చేసుకోవటం ముఖ్యమంటారు డాక్టర్లు. ఆయా భాగాలకు క్యాన్సరు సోకటానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి. అలాగే నాలుక మీద తెలుపుదనం, కళ్ళలో ఎర్రజీరలు లాంటివి ఆరోగ్యాన్ని తెలియజేయటంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. ఇవి కాకుండా శరీర ఆరోగ్యాన్ని తెలియజేయటంలో ముఖ్యపాత్ర వహించే మరి కొన్ని శరీరభాగాలున్నాయి. అవి –

Gorlu Nails Cheppe Arogyam in Telugu

చేతులు, పాదాల గోళ్ళు!!

అనుభవజ్ఞులైన డాక్టర్లు కేవలం గోళ్ళను చూడటం ద్వారా 40 రకాల దాకా శరీర లవలక్షణాలను తెలుసుకోవచ్చునంటారు. రక్తహీనత నుంచి ఊపిరితిత్తుల వ్యాధి దాకా. గుండె జబ్బు దగ్గరనుంచి మెదడు పనిచేయకపోవటం దాకా.

గోళ్ళ తాలూకు రంగు, షేపు, మందం, గోళ్ళు వేళ్ళకు అంటుకుని ఉన్నాయా లేక ఎడంగా ఉన్నాయా లాంటి వివిధ లక్షణాలను బట్టి ఆయా అనారోగ్యాలను

కోవచ్చునంటారు వీళ్ళు.

ఇప్పుడు వీటిలో కొన్ని లక్షణాలు గురించి చూద్దాము :

గోళ్ళు కొరుక్కోవటం

ఒక మనిషికి గోళ్ళు కొరుక్కునే అల వాటుందా లేదా అనేది గోళ్ళను చూస్తే తెలిసి పోతుంది. ఈ లక్షణం ఉన్నవాళ్ళ గోళ్ళు పైభాగాన చిగురంతా లోపలికి పోయి ఉంటాయి.

మీరు గోర్లు కొరుక్కుంటున్నార ఒకసారి చుడండి

గోళ్ళను నీట్ గా కట్ చేసుకునే వాళ్ళకీ వీళ్ళకూ తేడా ఏమిటంటే నీట్గా కట్ చేసుకునేవాళ్ళ గోళ్ళు వేళ్ళ చివరల పైదాకా అందంగా గుడ్రంగా వుంటే కొరుక్కునే అలవాటున్న వాళ్ళ గోళ్ళు చిగుళ్ళకంటా కిందకుండి ఎగుడు దిగుడుగా ఉంటాయి. ఒకోసారి వీళ్ళు చిగురుకంటా నెత్తురు వచ్చేదాకా కూడా కొరుక్కుంటారు.

గోళ్ళు కొరుక్కునే అలవాటు ఆ వ్యక్తిలోని ఆందోళనని, నెర్వస్నెస్నీ, టెన్షన్నీ సూచిస్తుంది. మరీ చిగురుకంటా నెత్తురోడేదాకా కొరుక్కుంటున్నట్లు కనిపిస్తే మరీ తీవ్రమైన నెర్వస్నెస్తో ఉంటున్నట్లూ దానినతను లేక ఆమె కంట్రోల్ చేసుకోలేకపోతున్నారనీ అర్ధం చేసుకోవచ్చు.

గోళ్ళు కొరుక్కోవటం ఆ వ్యక్తి మానసిక అనారోగ్యాన్ని సూచిస్తుంది.

పాలిపోయిన గోళ్ళు

తెల్లగా పాలిపోయినట్లుండే గోళ్ళు ఆ మనిషిలోని రక్తహీనత (Anemia)ని సూచిస్తుంది. ఎండలో గడిపి వచ్చినా లేక రంగు వేసుకున్నా గోళ్ళ తాలూకు పాలిపోవటం కనిపించదు. గోళ్ళు పాలిపోయినట్లు మాత్రమే కాకుండా పెళుసుగా చిట్లి కూడా కనిపిస్తే అది ఆ వ్యక్తిలోని రక్తహీనత తీవ్రతను సూచిస్తుంది.

By BB

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *