ASALU EKADasi pamduga ela vachindi in telugumore

Toli Ekadasi Panduga Visistataha in Telugu తొలి ఏకాదశి పండుగ విశిష్టత

సృష్టి విషయంలో బ్రహ్మదేవుడికి భూలోకంలోని అమ్మలు సాయం చేస్తారు. అయితే ఒకప్పుడు రాక్షస సంహారం విషయంలో విష్ణువుకు ఓ అమ్మాయి సహాయం చేసిన వైనాన్ని భవిష్యోత్తర పురాణం వివరించింది. ఆ అమ్మాయి పేరే ఏకాదశి!

అది కృతయుగం నాటి మాట. తాళజంఘుడి కొడుకు మురాసురుడు చాలా బల వంతుడు. దేవతలతో సహా జీవులందరినీ నిరంతరం వేధించడమే వాడి పని. దిక్కు తోచని పీడితులంతా చేరి, విష్ణువుకు మొరపెట్టుకున్నారు. విష్ణువు మురాసురుడితో యుద్ధానికి దిగాడు. ఏళ్ల తరబడి పోరాడినా… మహా వరబల సంపన్నుడైన మురుణ్ని ఆయన జయించలేకపోయాడు. అలసటతో సింహవతి అనే గుహలో దాగిన సమయంలో విష్ణువు సంకల్పంలోంచి ఏకాదశి అనే స్త్రీ ఆవిర్భవించింది. పుడుతూనే వీరావేశంతో దానవుడిపై దండెత్తి వాణ్ని తుదముట్టించింది. మురాసుర సంహారంలో ఏకాదశి ప్రదర్శించిన సాహసానికి పరవశుడైన శ్రీహరి వరం కోరుకోమన్నాడు. ‘ఎల్ల అంతర్యామి…

తొలి ఏకాదశి పండుగ విశిష్టత Latest anganwadi jobs today

కాలం నీకు ప్రియమైనదానిగా ఉండాలి’ అని కోరింది ఏకాదశి. విష్ణువు అంగీకరించాడు. అందుకే ఏకాదశికి ‘హరిప్రియ’ అనే పేరొ చ్చింది. తన పేరుతో ఒక పుణ్యతిథి ఏర్పడా లని, ఆనాడు హరి సంకీర్తనంలో మునిగి, ఉపవాసం ఉండే భక్తులకు పుణ్యగతులు సిద్ధించాలన్న ఆమె కోరికనూ విష్ణువు మన్నిం చాడు. అది మనకు వరమైంది. ఏకాదశి రోజున ఉపవాస, హరి ఉపాసనాది ప్రత్యేక విధులు ఆచారాలుగా స్థిరపడ్డాయి.

నిజానికి మురాసురుడు- మనలోని హింసాత్మక ప్రవృత్తికి, దురాచార ప్రీతికి, దుర్మార్గపు ఆలోచనలకు ప్రతీక. వాటిని అంతమొందించ డానికే ఉపవాసాది విధులు నిర్వర్తించి ఏకాద శిని మనలోకి ఆవాహన చేసుకుంటాం. అరిని (మనలోని శత్రువులను జయించేందుకు హరిని ఆశ్రయించేలా చేస్తోంది కాబట్టే- ఏకా దశిని ‘హరివాసరం’ అన్నారు. ఏకాదశి వ్రత విధానాలను, ద్వాదశి పారణలను ఎందరో పాటిస్తున్నారు. అనారోగ్యం, వృద్ధాప్యం లేదా విధి విధానాలపట్ల అవగాహన లేకపోవడం… వంటి కారణాలతో దూరంగా ఉన్నవారు- కనీసం ఆనాడు శ్రీహరికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి.

ఏకాదశి పూట ఓ చిన్నారి గుళ్లో దేవుడి దగ్గర కూర్చొని ఏవేవో మాటలు వల్లిం చడం విని, ‘నీకు మంత్రాలొచ్చా’ అని అడిగాడు పూజారి. దానికా పాప ‘నాకు అ ఆ ల నుంచి య ర ల వ ల దాకా వచ్చు. ఏకాదశి అంటే 11 కదా! కాబట్టి నాకు వచ్చినవాటినే 11 సార్లు చెబుతూ- నీకిష్టమైన మంత్రాలో శ్లోకాలో పద్యాలో నువ్వే రాసుకోమని దేవుడికి చెబుతున్నాను. ఆయనకు అన్నీ వచ్చంట! మా తాతయ్య చెప్పారు’ అంది. ఉపవాసమనే మాటకు అదీ అర్థం. దైవానికి సమీపంగా ఉండటమే ఉపవాసం. ఆ పాప చేసిందదే. కాబట్టి ఆ పాప తప్పక ‘హరిప్రియ’ అవుతుందనేది ఏకాదశి సందేశం.

నీటిలో మునిగితే- అది స్నానం. నీలో మునిగితే- అది ధ్యానం! ఆకలిదప్పులు | తోచనంతగా హరినామ స్మరణంలో, ధ్యానంలో మునిగిపోవడమే తొలి ఏకాదశి నాటి కర్తవ్యం. అప్పుడది నిజమైన హరివాసరం!

By Rock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *